Ilaiyaraaja: ఆ బాధ నన్ను ఇప్పటికీ వేధిస్తుంది.. తప్పు చేశానంటూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్

by Mallepaka Hamsa |

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా(Ilaiyaraaja) వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.

Ilaiyaraaja: ఆ బాధ నన్ను ఇప్పటికీ వేధిస్తుంది.. తప్పు చేశానంటూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా(Ilaiyaraaja) వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. అంతేకాకుండా ఎన్నో సాంగ్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. అయితే ఆయన ఇటీవల తన కూతురిని కోల్పోయిన విషయం తెలిసిందే. గాయని, సంగీత దర్శకురాలైన భవతారిణి(Bhavatarini) క్యాన్సర్‌తో పొరాడుతూ కన్నమూసింది.

అయితే ఆమె మొదటి వర్ధంతి రాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఇళయరాజా x ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘నేను ఎంతగానో ప్రేమించే నా కూతురు దూరమై ఏడాదవుతోంది. తను మాతో లేదన్న బాధ ఇప్పటికీ నన్ను వేధిస్తోంది. తను నాపై ఎంతో ప్రేమ కురిపించేది. ఎంత అప్యాయత చూపించేదన్న విషయం తనను కోల్పోయిన తర్వాత తెలుసుకున్నాను. నా జీవితమంతా సంగీతానికే ధారపోశాను.

ఈ క్రమంలో నా కుటుంబాన్ని పట్టించుకోలేదు. పిల్లలను నిర్లక్ష్యం చేసి తప్పు చేశాను. వారికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. ఈ చేదు నిజం నన్ను ఇప్పటికీ కుంగదీస్తోంది. సంగీతం ఎంతోమందికి ఓదార్పు నిస్తుందంటారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అదే సంగీతం నాకు కొంత స్వాంతన కలిగిస్తోంది. ఫిబ్రవరి 12న నా పుట్టినరోజు. ఆరోజు నా కూతురికి నివాళిగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. నా కూతురు ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇళయరాజా కామెంట్స్ వైరల్ అవుతుండగా.. సినీ సెలబ్రిటీలు ఆయనకు ధైర్యం చెబుతున్నారు.

Next Story