- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమా వల్ల నా కెరీర్ మొత్తం స్పాయిల్ అయింది.. అలనాటి హీరోయిన్ సంచలన కామెంట్స్
తెలుగు సినీపరిశ్రమలో వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్లలో రాశి(Rasi) ఒకరు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినీపరిశ్రమలో వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్లలో రాశి(Rasi) ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ తర్వాత హీరోయిన్‌గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అలా పవన్ కళ్యాణ్, జగపతి బాబు, శ్రీకాంత్, బాలకృష్ణ హీరోల సరసన నటించి తనదైన ముద్ర వేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన రాశి.. ఇటు ట్రెడిషనల్.. అటు గ్లామరస్ పాత్రలలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.
అయితే కొంత కాలం ఇండస్ట్రీకి దూరమైన ఈ చిన్నది ప్రజెంట్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి సీరియల్స్‌లో యాక్ట్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. “డైరెక్టర్ తేజ నిజం సినిమాలో నా పాత్రను పాజిటివ్‌గా చెప్పారు. తీరా సెట్‌కు వెళ్లాక మొదటిరోజే నాతో చేయకూడని సీన్ చేయించారు. అసలు ఆ సీన్ ఉంటుందనే చెప్పలేదు.
చాలా హర్టయ్యాను. సినిమా చేయనన్నాను. నాకున్న ఇమేజ్‌కు సినిమా చేశానంటే కెరీర్ ఆగిపోతుంది.. నా వల్ల కాదన్నాను. కానీ చేయాల్సిందేనన్నారు. దీంతో ఇష్టం లేకుండానే ఆ మూవీ చేశాను. డబ్బింగ్ సమయంలో తేజ కాల్ చేసి సారీ చెప్పారు. ఈ విషయంలో ఆయనను ఎప్పటికీ క్షమించలేను. ఆ సినిమా వల్ల నా కెరీర్ మొత్తం స్పాయిల్ అయింది. ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్‌ను మర్చిపోవాలనుకుంటున్నారు ? అని అడిగితే తేజ పేరు చెప్తాను. నా పుట్టినరోజే నాన్న చనిపోయారు. అది ఎప్పటికీ మర్చిపోలేని విషాదం” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారింది.






