సూర్యుడిని కిస్ చేసిన ఆ క్షణం ఎంతో హ్యాపీగా ఉంది.. కీర్తి శెట్టి ఇంట్రెస్టింగ్ పోస్ట్

by I. Sairam |

‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

సూర్యుడిని కిస్ చేసిన ఆ క్షణం ఎంతో హ్యాపీగా ఉంది.. కీర్తి శెట్టి ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ సినిమాతోనే బేబమ్మగా తెలుగు ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. దీంతో ఈ క్యూట్ హీరోయిన్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా చాలా సినిమాల్లో నటించినా ఉప్పెన లాంటి హిట్ అయితే రాలేదు. దీంతో కొన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ప్రజెంట్ ప్రదీప్ రంగనాథ్(Pradeep Ranganath) హీరోగా నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Company) మూవీలో నటిస్తున్న ఈ చిన్నది.. రీసెంట్‌గా స్టార్ హీరో కార్తి(Karthi) నటించిన ‘అన్నగారు వస్తారు’(annagaru Vastharu) మూవీతో మన ముందుకు వచ్చింది.

నలన్ కుమార స్వామి(Nalan Kumarasamy) దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞాన్‌వేల్ రాజా నిర్మించారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం స్టైలిష్ వేర్ డ్రెస్సులతో కుర్రకారును ఫిదా చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కృతి శెట్టి తన ఇన్‌స్టా(Instagram) అకౌంట్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ జెగ్గిన్‌కు గోల్డ్ కలర్ టీషర్ట్ పెయిరప్ చేసింది. హెయిర్ లీవ్ చేసుకుని ఎండలో ఎంతో ముద్దుగా చూస్తూ కనిపించింది. ఇక వాటిని షేర్ చేస్తూ.. ‘సూర్యుడిని ముద్దు పెట్టుకున్న ఆ క్షణం ఆనందంగా ఉంది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు క్రేజీగా ఉన్నావు బేబమ్మా, సూపర్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story