- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘జీవితంలో నేను సంపాదించుకున్న ఆస్తి అదే’.. బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ).

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ). ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య నిర్మించారు. ఇక ఈ చిత్రం జనవరి 12న విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే కలెక్షన్ల విషయంలో భారీగా వసూళ్లు సాధిస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ‘డాకు మహారాజ్’ ఈవెంట్‌లో భాగంగా పాల్గొన్న బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఫుడ్ విషయంలో నా భార్య వసుంధర నన్ను తిడుతూ ఉంటుంది. నేను ఫిట్‌గా ఉండేందుకు ప్రత్యేకమైన ఫుడ్ లాంటిది ఏం తీసుకోను. షూటింగ్ టైంలో కూడా నేను ప్రొడక్షన్ ఫుడ్ తింటాను. అలాగే పార్టీలకు, కులాలకు అతీతంగా నాకు అందరు అభిమానులు ఉన్నారు, జీవితంలో నేను సంపాదించుకున్న ఆస్తి అదే’ అని బాలయ్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






