- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు ఇండస్ట్రీపై అప్పుడు పొగడ్తలు ఇప్పుడు తిట్లు.. తాప్సీలో మస్తు షేడ్స్ ఉన్నాయ్‌గా
టాలీవుడ్ ద్వారానే ఇంస్ట్రీకి పరిచయమైన తాప్సీ ఇప్పుడు టాలీవుడ్ పైనే విమర్శలు చేస్తోంది. అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతోంది.

దిశ, వెబ్ డెస్క్: అన్నంపెట్టిన చేతికే సన్నం పెట్టడం అనే సామెత వినే ఉంటారు. ఈ సామెత కొంతమంది హీరోయిన్లకు వందశాతం సరిపోతుంది. ముఖ్యంగా తెలుగులో సినిమాలు చేసి తరవాత బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చిన హీరోయిన్లు అయితే చాలా వరకు ఈ సామెతకు సరిపోయేలా ప్రవర్తిస్తారు. హీరోయిన్ తాప్సీ పన్ను కూడా ఆ కోవకు చెందిన హీరోయినే. తాప్సి మొట్టమొదటి సినిమా జుమ్మంది నాదం. ఈ సినిమాకు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. చిత్రంలో మనోజ్ కు జంటగా తాప్సి నటించి మెప్పించింది. తన క్యూట్ అందంతో అభిమానులకు దగ్గరైంది. ఈ సినిమాతోనే తాప్సికి తెలుగులో అభిమానులు అయ్యారు.
ఇక ఇప్పుడు తాప్సీ ఏకంగా బాలీవుడ్ సినిమా ఆఫర్లను సైతం అందుకుంటుంది. అయితే లైఫ్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీపైనే తాప్సి ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడటం ఆశ్చర్యకరం. అంతే కాకుండా తనతో సినిమా చేసిన దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావును అవమానపర్చినట్టు మాట్లాడింది. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాప్సి మాట్లాడుతూ.. తనను పరిచయం చేసిన దర్శకుడు ఏం పట్టుకున్నా బంగారమే అనే ఒక నమ్మకం ఉంది. ఆయనే శ్రీదేవి, జయసుధ లాంటి హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. తనతో 105వ సినిమా చేశారని చెప్పింది.
ఆయనకు మహిళల అవయవాలు చూపించడం బాగా తెలుసని చెప్పింది. అమ్మాయిల నడుము చూపిస్తూ దానిపై పువ్వులు, పండ్లతో కొట్టించేవాడని చెప్పింది. ఇప్పుడు తన వంతు వచ్చిందని అనుకున్నానని శ్రీదేవి లాంటి హీరోయిన్ల వీడియోలు చూసి తనపై ఎలాంటి పండ్లు వేస్తారో అని అనుకున్నానని తెలిపింది. ఇక తన సమయం వచ్చినప్పుడు సిద్దంగా లేనని, తన నడుంపై కొబ్బరివక్కతో కొట్టారని చెప్పింది. అందులో ఏం రొమాంటిక్ గా ఉందో తనకు అర్థం కాలేదని వ్యాఖ్యానించింది. తాప్సి చెబుతుంటే పక్కన కూర్చున్నవాళ్లంతా పగలబడి నవ్వేశారు.
అయితే ఇప్పుడు ఇలా మాట్లాడిన తాప్సి జుమ్మందినాదం సినిమా రిలీజ్ సమయంలో మరోలా మాట్లాడింది. రాఘేవేంద్రరావు సినిమాలో గుమ్మడికాయలు, ఆప్సిల్స్, గ్రేప్స్ ఉంటాయని ఇంకా చాలా ఉంటాయని చెప్పింది. తనపై ఏ పండు వేశారో తెలియాలంటే సినిమాలోనే చూడాలని వ్యాఖ్యానించింది. అది కూడా చాలా సంతోషంగా చెప్పింది. ఇక ఇప్పుడు తాప్సి లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీ, దర్శకుడినే కించపర్చేలా మాట్లాడటంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.






