‘ఈ అందమైన జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు’.. హ్యాపీ బర్త్‌డే మై హార్ట్ అంటూ యంగ్ బ్యూటీ స్పెషల్ విషెస్

by Gugulothu.Kavitha |

యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

‘ఈ అందమైన జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు’.. హ్యాపీ బర్త్‌డే మై హార్ట్ అంటూ యంగ్ బ్యూటీ స్పెషల్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’(Ichata Vahanalu Nilaparadhu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కూడా నటించారు. ప్రస్తుతం నాగ చైతన్య సరసన ‘NC-24’ మూవీలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి మరోపక్క నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్‌లతో పాటు వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది.

అందులో తన అమ్మగారితో దిగిన చైల్డ్ హుడ్ ఫొటోస్, రీసెంట్ పిక్స్‌ను షేర్ చేస్తూ.. ‘మా హార్ట్, మైండ్, సోల్ అయినటువంటి అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఈ అందమైన జీవితాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.. జన్మదిన శుభాకాంక్షలు అమ్మ.. నువ్వు ఈ రోజు అండ్ ప్రతిరోజూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు మీనాక్షి చౌదరి అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story