Thandel Success Party :‘తండేల్’ సక్సెస్ పార్టీ.. హాజరైన సినీ ప్రముఖుల పిక్స్ వైరల్

by Kodari Anjali |   (  Updated:2025-02-24 14:43:25  IST  )

చందూ మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ (Tandel) చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

Thandel Success Party :‘తండేల్’ సక్సెస్ పార్టీ.. హాజరైన సినీ ప్రముఖుల పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: చందూ మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ (Tandel) చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya)కు జోడిగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) కథానాయికగా నటించి.. ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ యువతను మరింత ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 10 వ తారీకున విడుదలైన తండేల్ థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. ఏకంగా ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.

నాగ చైతన్య.. సాయిపల్లవి కలిసి నటించడం ఇది రెండోసారి. రెండు సినిమాలు కూడా హిట్ ఖాతాలో చోటు సంపాదించుకున్నాయి. ఇక తండేల్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్‌(Geetha Arts Banner)పై అత్యంత బడ్జెట్ తో బన్నీ వాసు (Bunny Vasu) అండ్ అల్లు అరవింద్ (Allu Aravind) కలిసి నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నాగచైతన్య కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా తండేల్ థియేటర్లలో నడుస్తుండటం విశేషం. ఇకపోతే ఈ మూవీ 10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సందర్భంగా ఈ మూవీ నిర్మాతలు సక్సెస్ పార్టీని అరైన్ చేశారు. ఈ సందర్భంగా పార్టీకి సినీ ప్రముఖులను ఆహ్వానించారు. నాగచైతన్య సాయి పల్లవి ‘తండేల్’ సక్సెస్ పార్టీకి సినీ పరిశ్రమ(Film Industry) తరలివచ్చిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story