- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Thammudu: తమ్ముడు సినిమా నుంచి మరో ట్రైలర్
టాలీవుడ్ సీనియర్ హీరో నితిన్ ( Nithin) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సీనియర్ హీరో నితిన్ ( Nithin) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన హీరోలలో నితిన్ కూడా ఉంటారు. మొదట్లో సక్సెస్.. ఆ తర్వాత ఫెయిల్యూర్స్ చవిచూసిన తర్వాత... మళ్లీ పికప్ అందుకున్నాడు హీరో నితిన్. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తమ్ముడు సినిమాతో ( Thammudu) తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు హీరో నితిన్.
అప్పట్లో పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకోగా... ఇప్పుడు అదే ఊపులో నితిన్ కూడా వస్తున్నాడు. నితిన్ తన ప్రతి సినిమాలో పవన్ కళ్యాణ్ గురించి ఒక సీనైనా ఉండేలా చూసుకుంటాడు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి రేపు మరో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది.
రేపు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కాగా వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే నితిన్ సరసన సప్తమి గౌడ ( Spthami gouda), వర్ష బొల్లమ్మ ( Varsha Bollamma) హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అలాగే సీనియర్ నటి లయ కూడా కీలకపాత్రలో కనిపిస్తున్నారు. కాగా ఈ సినిమా జూలై 4 అంటే వచ్చే వారంలోనే రిలీజ్ కాబోతుంది.






