Thaman : ఆయన లేకపోతే 'దూకుడు'లో అవకాశమే వచ్చేది కాదు

by Pulgam srinivas |

తాజాగా తమన్ మాట్లాడుతూ... కోన వెంకట్ గారి వల్లే దూకుడు సినిమాలో నాకు అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు.

Thaman : ఆయన లేకపోతే దూకుడులో అవకాశమే వచ్చేది కాదు
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన సంగీత దర్శకులలో ఎస్ఎస్ తమన్ ఒకరు. ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ను మొదలుపెట్టి చాలా కాలం అవుతుంది. ఇప్పటివరకు ఈ సంగీత దర్శకుడు అనేక సినిమాలకు మ్యూజిక్ అందించి తన సంగీతంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తమన్ కి తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును తీసుకువచ్చిన సినిమాలలో దూకుడు ఒకటి. మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన దూకుడు సినిమాకు సంగీతం అందించి తమన్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఈ చిత్రానికి కోన వెంకట్ కథను అందించాడు. తాజాగా తమన్ ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. అందులో భాగంగా తాను ఈ స్థాయికి రావడానికి ఎవరు సహాయపడ్డారు అనేది తెలియజేశాడు. తాజాగా తమన్ మాట్లాడుతూ... దూకుడు సినిమాకు ముందు కొన్ని సినిమాలకు నేను పని చేశాను. ఆ సినిమాలకు సంబంధించిన మ్యూజిక్ను కొనా వెంకట్ గారికి పంపించాను. ఇక ఆయనకు నా మ్యూజిక్ బాగా నచ్చి దూకుడు సినిమాలో అవకాశం ఇచ్చాడు.

ఆ సినిమా మంచి విజయం సాధించడం, అందులోని సంగీతానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆయన వల్లే నాకు దూకుడులో అవకాశం వచ్చింది అని తమన్ తాజాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమన్ అనేక సినిమాలకు సంగీతం అందిస్తూ అత్యంత బిజీ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్నారు. ఈయన రీసెంట్ టైంలో సంగీతం అందించిన సినిమాలలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ మూవీలోని మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ లభించింది.

Next Story