- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉస్తాద్ కోసం రంగంలోకి థమన్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన టీమ్
‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ జాయిన్ కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మైత్రీ మూవీ మేకర్స్.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తా్ద్ భగత్ సింగ్’ కోసం థమన్‌ను రంగంలోకి దింపారు టీమ్. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్ నుండి వచ్చిన ‘దేఖ్ లేంగే సాలా’ అండ్ ‘ఔరా ఆఫ్ ఉస్తాద్’కు బ్లాక్ బస్టర్ స్పందన ఇచ్చినందుకు ధన్యవాదాలు. సంగీతం పట్ల మీకున్న ప్రేమ అద్భుతం. రాబోయే పాట కూడా మీ హృదయాలను హత్తుకుంటుందని మేము నమ్ముతున్నాము. రాక్‌స్టార్ డీఎస్పీ అండ్ దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి అభిమానులు పండుగ చేసుకునే పాటలను అందించారు.
అయితే.. ఇప్పుడు, DSP ముందుగా అనుకున్న కాల్ షీట్స్, ఇతర ప్రాజెక్టుల బిజీ షెడ్యూల్ కారణంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం రీల్స్‌ను ఫైనల్ చేయడంలో, పంపడంలో ఆలస్యం అయింది. దీంతో ఆయన నిర్ణయాన్ని గౌవవిస్తూ.. మా (మైత్రీ మూవీ మేకర్స్) పరస్పర అంగీకారంతో.. బీజీయస్ స్కోరు కోసం థమన్‌ను బోర్డులోకి తీసుకొస్తున్నాము. DSP పాటలు మిమ్మల్ని డ్యాన్స్ చేపిస్తాయి.. థమన్ నేపథ్య స్కోరును నిర్వహిస్తాడు. థియేటర్స్‌లో మోమరబుల్ ఎక్స్‌పీరియన్స్‌ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి’ అని మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.






