- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరోతో సినిమా...మూడు కీ-బోర్డులు పగలగొట్టిన తమన్
రెండు, మూడు కీ బోర్డులు పగలగొట్టానని వెల్లడించారు తమన్. 'అఖండ2' 250 కోట్లు కలెక్ట్

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య హీరోగా చేసిన తాజా సినిమా 'అఖండ 2'. బోయపాటి శ్రీను.. ఈ సినిమాను చాలా గ్రాండ్ తీశారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా, చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఉన్నాయి. డిసెంబర్ 5న అఖండ 2 విడుదల కానుండగా, తాజాగా అఖండ తాండవం సాంగ్ లాంచ్ చేశారు. ముంబైలో జరిగిన ఈ ఈవెంట్ లో ఎస్.ఎస్ తమన్ కూడా పాల్గొని మాట్లాడారు.
'అఖండ2' ఫస్టాఫ్ మ్యూజిక్ కంప్లీట్ అయ్యిందని, సెకండాఫ్ పైన వర్క్ చేస్తున్నామని ప్రకటించారు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ఇంకా గొప్పగా ఉంటుందన్నారు. సెకండాఫ్ కు ఏం చేయాలో నాకు అర్థం కాక రెండు, మూడు కీ బోర్డులు పగలగొట్టానని వెల్లడించారు తమన్. 'అఖండ2' 250 కోట్లు కలెక్ట్ చేయబోతుందని తమన్ పేర్కొన్నారు. బాలయ్య సినిమాలు నాకు కేస్ స్టడీతో సమానం అన్నారు. నా ఫాన్స్ కు ఈ సినిమాలో ఏం ఇస్తున్నావ్ ? అని బాలయ్య నన్ను ఎప్పుడూ అడుగుతుంటారని గుర్తు చేశారు.






