- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ ఫ్యాన్స్‌కు బిగ్ గుడ్ న్యూస్.. సెకండ్ సింగిల్ అప్డేట్
ప్రజెంట్ రాజకీయాలతో పాటు సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.

దిశ, సినిమా: ప్రజెంట్ రాజకీయాలతో పాటు సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్. తన సినీ కెరీర్‌లోనే చివరి సినిమాగా రాబోతోన్న చిత్రం ‘జన నాయగన్’. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే విజయ్ కెరీర్‌లో ఇది లాస్ట్ సినిమా అనే ప్రచారం జరుగుతుండగా.. దీనిపై ఫ్యాన్స్ అండ్ సినీ లవర్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తుండగా.. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. మమిత బైజు, ప్రియమణి, శృతి హాసన్, బాబీ డియోల్, మోనిషా బ్లెస్సీ, జోసెఫ్ విజయ్, గౌతమ్ మీనన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం ప్రమోషనల్ కంటెంట్‌తో మూవీని మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా విజయ్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. విజయ్ స్టైలిష్ స్టిల్స్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘జన నాయగన్’ పోస్టర్ల కంటే ఫొటోషూట్ స్టిల్స్ చాలా బాగున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అలాగే.. ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ డిసెంబర్ 4న తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. లింక్






