- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆందోళనలో దళపతి విజయ్ ఫ్యాన్స్.. ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు
ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ చీఫ్ దళపతి విజయ్ (Vijay)కి భద్రతా వైఫల్యం కారణంగా పెను ప్రమాదం తప్పిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ చీఫ్ దళపతి విజయ్ (Vijay)కి భద్రతా వైఫల్యం కారణంగా పెను ప్రమాదం తప్పిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి 24 ఏళ్ల అరుణ్ (Arun) అనే యువకుడు సెక్యూరిటీ కళ్లుగప్పి విజయ్ ఇంటి టెర్రస్‌పైకి చేరుకున్నాడు. ఈ క్రమంలో అటే ఇటూ తిరుగుతున్న అతడిని భద్రతా సిబ్బంది కనిపెట్టి నీలాంకరై (Neelankarai) పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అరుణ్ చెన్నై (Chennai)లోని వేలాచేరి (Velachery)లో తన అత్తతో ఉంటున్నాడని, గత నాలుగు సంవత్సరాలుగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం అతన్ని కిల్పాక్ ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రికి తరలించారు. అయితే, హై ప్రొఫైల్ వ్యక్తుల నివాసాల వద్ద మరోసారి భద్రతా వైఫల్యం పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.






