Tere Ishk Main: కొన్ని ప్రేమ కథలు అగ్ని నుంచి పుట్టుకొస్తాయి.. ఆకట్టుకుంటున్న హీరోయిన్‌ ఫస్ట్ లుక్‌ గ్లింప్స్

by I. Sairam |   (  Updated:2025-08-28 07:47:09  IST  )

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) - సుకుమార్(Sukumar) కాంబోలో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’(One Nenokkadine) సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్(Krithi sanan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Tere Ishk Main: కొన్ని ప్రేమ కథలు అగ్ని నుంచి పుట్టుకొస్తాయి.. ఆకట్టుకుంటున్న హీరోయిన్‌ ఫస్ట్ లుక్‌ గ్లింప్స్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) - సుకుమార్(Sukumar) కాంబోలో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’(One Nenokkadine) సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్(Krithi sanan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) సరసన 'దోచేయ్'(Dochey) మూవీలో నటించింది. కానీ ఈ సినిమా కూడా అనుకున్నంత హిట్ కాలేదు. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌(Bollywood)కు చెక్కేసింది.

అయితే తెలుగులో ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్ర తెచ్చుకున్న కృతి సనన్.. బాలీవుడ్‌లో మాత్రం స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. అక్కడ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే మళ్లీ రీసెంట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘ఆదిపురుష్’(adiPurush) సినిమాలో సీతగా కనిపించి తెలుగు అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. కృతి సనన్ లండన్‌‌కు చెందిన ఓ కోటీశ్వరుడి కొడుకు కబీర్ బాహియా(Kabir Bahiya) అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలు కూడా బయటకు రావడంతో ఈ జంట ప్రేమలో ఉన్నారని అందరికీ అర్థం అయింది.

త్వరలోనే కృతి సనన్‌ కబీర్ బహియాను వివాహం చేసుకోవడానికి కూడా సిద్ధమవుతుందని తెలుస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో యూత్‌కు పిచ్చెక్కిస్తుంది. ఇదిలా ఉంటే.. స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘తేరే ఇష్క్ మే’(Tere Ishk Main). లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్(anand L Rai) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని గతంలోనే ప్రకటించగా.. తాజాగా ఈ మూవీలో హీరోయిన్‌‌ను రివీల్ చేశారు మేకర్స్.

ఇందులో భాగంగా హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ కృతి సనన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్‌చేస్తూ సోషల్ మీడియా వేదికగా మూవీ గ్లింప్స్‌(Glimps)ను రిలీజ్ చేశారు. అలాగే దీనికి “కొన్ని ప్రేమ కథలు అగ్ని నుంచి పుట్టుకొస్తాయి” అనే క్యాప్షన్‌ను జోడించారు. కాగా ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్(Bhushan Kumar) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ నవంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక గ్లింప్స్‌ను చూసినట్లయితే.. బాగా అల్లర్లు జరుగుతున్న ప్లేస్‌లో కృతి సనన్ ముందుకు నడుచుకుంటూ ఎంతో బాధ, కోపం ఉన్న మొహంతో కిరోసిన్ క్యాన్ మూత తీసి తన మీద పోసుకుంటుంది. ఆ తర్వాత కూర్చొని లైటర్ తీసి సిగరేట్ నోట్లో పెట్టుకుని వెలిగించేస్తది. అప్పుడు మొత్తం అక్కడ బ్లాస్ట్ అయిపోతుంది. దీంతో ఈ గ్లింప్స్ అయిపోయింది. అయితే కృతి సనన్ ‘ముక్తి’(Mukti) పాత్రలో అలరించబోతున్నట్లు తెలుస్తోంది.

Click For Video....

Next Story