జల్‌పల్లి మోహన్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ

by Malleboina Mahesh |   (  Updated:2024-12-10 07:46:17  IST  )

మంచు ఫ్యామిలీ వివాదం గంటకో మలుపు తిరుగుతోంది.

జల్‌పల్లి మోహన్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ
X

దిశ, వెబ్ డెస్క్: మంచు ఫ్యామిలీ వివాదం గంటకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే మోహన్ బాబు(mohan babu), మనోజ్(manoj) ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకొగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి ఇంటికి చేరుకోగానే మరోసారి వివాదం చెలరేగినట్లు తెలుస్తుంది. విష్ణు(vishnu) రాకతో.. భారీగా అతని బౌన్సర్లు.. జల్‌పల్లి లో ఉన్న మోహన్‌బాబు(mohanbabu) ఇంటి వద్దకు చేరుకున్నారు. అనంతరం మనోజ్ బౌన్సర్ల(Bouncers)ను ఇంటి నుంచి బయటకు పంపించారు. ఈ క్రమంలో విష్ణు, మనోజ్ బౌన్సర్ల(Bouncers) మధ్య ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తుంది. ఇంటి లోపలికి వెళ్లేందుకు మనోజ్ అనుచరులు ప్రయత్నించారు. దీంతో వారిని విష్ణు బౌన్సర్లు, అనుచరులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త(Clash) వాతావరణం నెలకొంది. అంతకు ముందు మనోజ్(manoj) మీడియాతో మాట్లాడుతూ.. తాను డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదని ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని.. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదని.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. న్యాయం కోసం అందరిని కలుస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story