- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థియేటర్లు ఓపెన్ చేయండి.. ఎగ్జిబ్యూటర్లకు నిర్మాతల విజ్ఞప్తి
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్(Film Chamber)లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లతో నిర్మాతలు నిర్వహించిన సమావేశం ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్(Film Chamber)లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లతో నిర్మాతలు నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల(Film Exhibitors) డిమాండ్లపై ప్రధానంగా చర్చించారు. థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారిని ఈ సందర్భంగా నిర్మాతలు కోరారు. రేపటి సమావేశంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుందామని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై రేపు మరోసారి భేటీ అవుదామని అన్నారు. దీంతో రేపటి సమావేశంలో ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. గతకొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ (Theatre Bandh) చేయాలని నిర్ణయించారు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు.






