సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చిన తెలుగు హీరోయిన్.. పర్‌ఫెక్ట్ వైఫ్ మెటిరియల్ అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) మనందరికీ సుపరిచితమే.

సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చిన తెలుగు హీరోయిన్.. పర్‌ఫెక్ట్ వైఫ్ మెటిరియల్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) మనందరికీ సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’(Vakeel Saab) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఫస్ట్ మూవీనే మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ మెప్పిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్‌గా కూడా రాణిస్తోంది. అలా గత ఏడాది ‘తంత్ర’(Tantra), ‘పొట్టేల్’(Pottel), ‘శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్’(Srikakulam Sherlock Holmes), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది.

అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ విషయాలను, సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అనన్య తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో పట్టు లంగా ఓణి కట్టుకొని, ఒంటినిండా నగలతో సింగారించుకుని అచ్చ తెలుగు ఆడపిల్లలా రెడీ అయింది. అయితే ఈ రోజు వరలక్ష్మి సందర్భంగా ఇలా ట్రెడిషనల్‌గా రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. అది చూసిన నెటిజన్లు పర్‌ఫెక్ట్ వైఫ్ మెటిరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story