తెలుగు హీరోలకు బాలీవుడ్ బ్యాడ్ లక్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-14 08:09:04  IST  )

తెలుగు హీరోల‌ను బాలీవుడ్ బ్యాడ్ ల‌క్ వెంటాడుతోంది. పాన్ ఇండియా సినిమాలు చేసి బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను వావ్ అనిపిస్తున్న హీరోలు నేరుగా బాలీవుడ్ సినిమా చేస్తే మాత్రం బోర్లాప‌డిపోతున్నారు.

తెలుగు హీరోలకు బాలీవుడ్ బ్యాడ్ లక్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు హీరోల‌ను బాలీవుడ్ బ్యాడ్ ల‌క్ వెంటాడుతోంది. పాన్ ఇండియా సినిమాలు చేసి బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను వావ్ అనిపిస్తున్న హీరోలు నేరుగా బాలీవుడ్ సినిమా చేస్తే మాత్రం బోర్లాప‌డిపోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్ర‌తి హీరోకు అలాంటి అనుభ‌వ‌మే ఎదుర‌వ్వ‌డం అభిమానుల‌ను సైతం నిరాశ‌ప‌డుతుంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తెలుగులో మ‌గ‌ధీర లాంటి సినిమా చేయ‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఇదే సినిమా హిందీలో డ‌బ్ చేయ‌గా బాలీవుడ్ ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

కానీ చ‌ర‌ణ్ ఆ త‌ర‌వాత నేరుగా జంజీర్ అనే బాలీవుడ్ సినిమాలో హీరోగా న‌టించాడు. భారీ బ‌డ్జెట్‌తో ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా తెరకెక్కింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అదే విధంగా ప్రభాస్ నటించిన బాహుబలి పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో బాలీవుడ్ తెలుగు సినిమా వైపు చూసింది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు కంటే హిందీ ప్రేక్షకులే బాహుబలిని ఆకాశానికి ఎత్తేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ పెరగ్గా ఆ తరవాత నేరుగా బాలీవుడ్ లో సాహో చిత్రంలో నటించాడు.

కానీ ఈ సినిమా హిట్ అవ్వలేదు. ఆ తరవాత ఆదిపురుష్ సినిమాలో నటించగా ఏకంగా డిజాస్టర్ అయ్యింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నట విశ్వరూపం చూసి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎంతో మంది ఎన్టీఆర్ కు అభిమానులు అయ్యారు. ఈ సినిమా తరవాత తాజాగా ఎన్టీఆర్ స్ట్రైట్ గా న‌టించిన బాలీవుడ్ సినిమా వార్ 2 విడుద‌లైంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు కూడా మిక్స్డ్ టాక్ వ‌స్తోంది. దీంతో బాలీవుడ్ అంటే తెలుగు హీరోల‌కు బ్యాడ్ ల‌క్కే అని మ‌రోసారి రుజువైంది.

Also Read..

War 2 Twitter Review: వార్ 2 ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..?

Next Story