- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chittemma: ప్రముఖ తెలుగు కమెడియన్ సప్తగిరి ఇంట్లో తీవ్ర విషాదం..
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఇటీవల మనోజ్ కుమార్ మరణించగా.. నిన్న బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్ మృతి చెందారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి ప్రసాద్ (Saptagiri Prasad) ఇంట్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది. సప్తగిరి తల్లి చిట్టెమ్మ (Chittemma) అనారోగ్య సమస్యల కారణంగా ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సప్తగిరి సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ట్విట్టర్ వేదిక తన అమ్మ ఫొటో పంచుకుని.. మిస్ యు అమ్మ అని రాసుకొచ్చారు. అలాగే చిట్టెమ్మ మరణించిన తేదీని కూడా జోడించాడు. Death: 04/08/2025అంత్యక్రియలు ఏప్రిల్ 9 వ తేదీన తిరుపతిలో జరగనున్నాయని తెలిపారు. ఇక నేడు సప్తగిరి తల్లి చిట్టెమ్మ అంత్యక్రియలు తిరుపతిలో నిర్వహించనున్నారు. ఈ వార్త విన్న పలువురు సినీ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.






