- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
టాలీవుడ్ యాంకర్, బుల్లితెర హీరోయిన్ సమీరా షెరిఫ్(Sameera Shareef) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాంకర్, బుల్లితెర హీరోయిన్ సమీరా షెరిఫ్(Sameera Shareef) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ చిన్నది ‘ఆడపిల్ల’(Adapilla) సీరియల్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత అభిషేకం(Abhishekam), భార్యామణి(Bharyamani), ముద్దుబిడ్డ(Muddu Bidda), మూడు ముళ్ల బంధం తదితర సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలాగే అదిరింటి షోకు కొన్ని రోజుల పాటు యాంకర్ గానూ వ్యవహరించింది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సమీరా షెరీఫ్ 2019లో అన్వర్ జాన్(Anwar Jahn) అనే వ్యక్తితో కలిసి పెళ్లి పీటలెక్కింది. అయితే ఈ జంటకు అర్హాన్ అనే బాబు ఉండగా.. ఇప్పుడు మరో బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చింది. ‘బుడ్డోడు మా జీవితాల్లోకి ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలు ఎప్పటికీ మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. నేను, నా బిడ్డ క్షేమంగా ఉన్నాం’ అని తన పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిని చూసిన పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు సమీరా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






