- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు గుడ్ న్యూస్ రివీల్ చేసిన బుల్లితెర జంట.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
అమర్ దీప్(Amar Deep), తేజస్విని గురించి పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: అమర్ దీప్(Amar Deep), తేజస్విని గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. కర్ణాటకకు చెందిన తేజస్విని(Tejaswini) చిన్ని సీరియల్‌లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. అలా తెలుగు కన్నడలో నటించిన ఆమె ఎంతోమంది అభిమానులను దక్కించుకుంది. ఇక అమర్ దీప్ కూడా సీరియల్ హీరోగా నటించడంతో పాటు తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. విన్నర్ కాలేకపోయినప్పటికీ క్రేజ్ మాత్రం సంపాదించుకున్నాడు. ఇక అమర్ దీప్, తేజస్విని సీరియల్ నటిస్తున్న క్రమంలోనే ప్రేమలో పడ్డారు. 2022లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కలిసి పలు డ్యాన్స్ షోలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌కు జంటగా హాజరవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇటీవల ఓంకార్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న ‘ఇస్మార్ట్ జోడి’ షోలోను పాల్గొని పలు గేమ్స్ ఆడారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, తేజస్విని జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్ షోకు గెస్ట్‌గా హాజరై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘గత కొద్ది రోజుల నుంచి విడాకులు తీసుకుంటున్నామని వార్తలు వస్తున్నాయి. అయితే ఏ మొగుడు పెళ్ళాల మధ్య అయినా గొడవలు సహాజం. అలా మా మధ్య కూడా ఉన్నాయి. కానీ మేము విడాకులు తీసుకోవడం లేదు. మేము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నాం. అయితే అమర్‌దీప్‌కు అమ్మాయే కావాలంట. నాకు ఎలాగూ ముందు నుంచి అమ్మాయే పుట్టాలని కోరిక ఉంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.






