- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖండ-2 సినిమా టికెట్ ధరల పెంపు.. జీవో విడుదల చేసిన తెలంగాణ సర్కార్
యువరత్న నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ-2’కి టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: యువరత్న నందమూరి బాలకృష్ణ (Nandmuri Bala Krishna) కథనాయకుడిగా.. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ-2’కి టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లలో జీఎస్టీతో కలిపి టికెట్‌పై రూ.100 పెంచుకునేందుకు వీలు కల్పించింది. అదేవిధంగా రేపు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో ధరను రూ.600గా నిర్ణయించారు. అందుకు సంబంధించిన జీవోను ఇవాళ విడుదల చేశారు. సినిమా విడుదలైన రోజు అంటే డిసెంబరు 12 నుంచి డిసెంబరు 14 వరకు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
కాగా, అఖండ-2 (Akhanda-2) మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయిన విషయం తెలిసిందే. 14 రీల్స్ ప్లస్, ఈరోస్ (Eros) సంస్థల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కారమవడంతో ఈ సినిమా 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా చిత్ర బృందం మంగళవారం రాత్రి ప్రకటించింది. 11న ప్రీమియర్ ప్రదర్శనలతోనే అఖండ-2 సందడి మొదలు కానుంది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియా మూవీ టీమ్ షేర్ చేసింది. విజయవంతమైన ‘అఖండ’ సినిమాకు కొనసాగింపుగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా మూవీని నిర్మించారు. సంయుక్తా మేనన్ కథానాయికగా.. ఆది పినిశెట్టి విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 5నే విడుదల కావాల్సి ఉండగా.. ఈరోస్ సంస్థతో ఉన్న ఆర్థిక వివాదాలతో ఆఖరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే.






