- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరిహర వీరమల్లు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్రీమియర్స్‌కు సర్కార్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో హరిహర వీరమల్లు టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటు 23వ తేదీన ప్రీమియర్ షోలకు కూడా తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటు 23వ తేదీన ప్రీమియర్ షో (HHVM Primiers)లకు కూడా తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర ఒక్కొక్కటి రూ.600గా నిర్ణయించింది. ఇక మల్టీప్లెక్స్ లో టికెట్ ధర రూ.200 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150 వరకూ పెంచుకునేందుకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా ఈ నెల 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దర్శకుడు క్రిష్ (Director Krish) ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా.. పవన్ సరసన నిధి అగర్వాల్ (Nidhi Agarwal) నటించగా.. ఎంఎం కీరవాణి (MM Keeravani) సంగీతాన్ని అందించారు.






