- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sunil Narang : తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా
by Muthe.Rajitha |
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్(Telangana Film Chamber President) తన పదవికి రాజీనామా(Resignation) చేశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్, ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్(Producer Sunil Narang) ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన జారీ చేశారు. కొంతమంది వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని, తనను సంప్రదించకుండానే, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కొంతమంది ప్రకటనలు జారీ చేస్తున్నారని అన్నారు.
ఆ ప్రకటనలకు తాను బాధ్యత వహించబోనని స్పష్టం చేశారు. అందుకే తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన 24 గంటల్లోనే సునీల్ నారంగ్ తన పదవికి రాజీనామా చేయడం సంచలనం రేపుతోంది.
Next Story






