తెలంగాణ ఎగ్జిబిటర్ల సంచలన నిర్ణయం.. థియేటర్లలో ‘రెంటల్ సిస్టమ్’ విధానం రద్దు

by Kema Shiva Kumar |

తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. 23 థియేటర్ల యాజమాన్యాలు రెంటల్ విధానాన్ని రద్దు చేసుకునేందుకు మొగ్గు చూపాయి.

తెలంగాణ ఎగ్జిబిటర్ల సంచలన నిర్ణయం.. థియేటర్లలో ‘రెంటల్ సిస్టమ్’ విధానం రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ (Tollywood) ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న ‘రెంటల్’ వివాదానికి తెరపడింది. తెలంగాణ (Telangana)లోని థియేటర్ల యాజమాన్యాలు ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇకపై థియేటర్లకు నిర్ణీత అద్దె చెల్లించే ‘రెంటల్ సిస్టమ్’ (Rental స్థానంలో, వసూళ్లలో వాటాను పంచుకునే ‘పర్సంటేజీ సిస్టమ్’ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కొత్త విధానానికి సంబంధించి రాష్ట్రంలోని 23 ప్రధాన థియేటర్ల యాజమాన్యాలు ఇప్పటికే తమ అంగీకారం తెలిపాయి. ఈ మార్పు ఏప్రిల్ 3 అంటే రేపటి నుంచి అధికారికంగా అమలులోకి రానుంది. దీంతో చిత్ర పరిశ్రమలో పంపిణీదారులు (Distributors) ఎదుర్కొంటున్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

ఈ మార్పు ఎందుకంటే..

ప్రస్తుతం ఉన్న రెంటల్ విధానం ప్రకారం.. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా డిస్ట్రిబ్యూటర్లు (Distributors) థియేటర్లకు భారీగా అద్దెలు చెల్లించాల్సి వచ్చేది. సినిమా ఫ్లాప్ అయితే పంపిణీదారులు నిలువునా మునిగిపోయేవారు. కానీ, తాజా పర్సంటేజీ విధానంలో థియేటర్ వసూళ్లలో (Collections) కొంత శాతం యాజమాన్యానికి, మిగిలినది డిస్ట్రిబ్యూటర్‌కు దక్కుతుంది. సినిమా బాగా ఆడితే ఇద్దరికీ లాభం, తగ్గితే నష్టం కూడా పంచుకోనున్నారు. ముఖ్యంగా చిన్న, మడిల్ స్టేజ్ తరహా సినిమాలకు ఈ విధానం కాస్త ఊరటనిస్తుంది.

Next Story