ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్ధను పునరుద్దరించాలి : రైతు కమిషన్​

by velandi.Saikiran |   (  Updated:2025-12-24 17:15:16  IST  )

రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను మళ్లీ పునరుద్దరించాలని రైతు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గ్రామాల్లో రైతులకు రా

ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్ధను పునరుద్దరించాలి : రైతు కమిషన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను మళ్లీ పునరుద్దరించాలని రైతు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గ్రామాల్లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఆదర్శ రైతులు పనిచేసే అవకాశం ఉంటుందని, వ్యవసాయ అధికారులకు సపోర్ట్ గా ఆదర్శ రైతు వ్యవస్థ పనిచేస్తుందని కమిషన్​చైర్మన్​ కోదండ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు లేఖ రాశారు ఈసందర్భంగా వివరిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు రైతులకు చేరడంలో ఆదర్శ రైతులు కీలకంగా పనిచేస్తారని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని, ఆదర్శ రైతు వ్యవస్థ ను తిరిగి ప్రారంభించడం ద్వారా రైతన్నలకు మరింత ప్రభుత్వ ఆలోచన విధానం, పథకాలు తెలుస్తాయని వివరించారు. ప్రభుత్వానికి ఎలాంటి ఆర్ధిక భారం పడదని స్పష్టం చేసింది. ఇప్పటికే రైతు సంఘాలు, ఆదర్శ రైతులు సైతం ఎలాంటి గౌరవ వేతనం కూడా లేకుండా సేవ చేయడానికి ముందుకు వచ్చినట్లు కమిషన్ తన లేఖలో వివరించింది. ఆదర్శ రైతు వ్యవస్థ పై రానున్న అసెంబ్లీ సమావేశంలో చర్చించి ఆమెదించేలా చేయాలని ప్రభుత్వానికి కమిషన్ లేఖ ద్వారా తెలిపింది. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సీఎంవో సెక్రెటరీ శేషాద్రి లను కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తోపాటు కెవిఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భూమి సునీల్ కలిసి వివరించారు.

Next Story