డిజాస్ట‌ర్ హీరోతో 'రాజు వెడ్స్ రాంబాయి' హీరోయిన్ కొత్త సినిమా?

by velandi.Saikiran |

రాంబాయి తేజస్వి రావుకు బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. హీరో నితిన్ తో ఓ కొత్త సినిమాలో తేజస్వి రావుకు

డిజాస్ట‌ర్ హీరోతో రాజు వెడ్స్ రాంబాయి  హీరోయిన్ కొత్త సినిమా?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇటీవల కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్న మూవీ రాజు వెడ్స్ రాంబాయి. ఖమ్మం, వరంగల్ సరిహద్దు ప్రాంతంలో వాస్తవ సంఘటన ఆధారంగా ఈ మూవీని తీశారు. సాయిలు కంపాటి అనే దర్శకుడు ఇండస్ట్రీకి ఈ సినిమా ద్వారా కొత్తగా పరిచయం అయ్యాడు. వేణు ఊడుగుల నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్, తేజస్వి రావు ఇద్దరూ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ ఇద్దరు కొత్త నటీ నటులు అయినప్పటికీ, సినిమాలో అద్భుతంగా నటించారు.

అయితే ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన రాంబాయి తేజస్వి రావుకు బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. హీరో నితిన్ తో ఓ కొత్త సినిమాలో తేజస్వి రావుకు అవకాశం వచ్చినట్లు టాక్ నడుస్తోంది. లిటిల్ హార్ట్స్ దర్శకుడు సాయి మార్తాండ్ ( Sai Marthand), హీరో నితిన్ కాంబినేషన్ లో ఒక కొత్త సినిమా రాబోతుందట. దీనికి "ఓనవా" అనే టైటిల్ అనుకుంటున్నారట‌. అయితే, ఇందులో తేజస్వి రావుకు ఛాన్స్ ద‌క్కిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు సాయి మార్తాండ్ చ‌ర్చ‌లు చేస్తున్నార‌ట‌. కాగా హీరో నితిన్ కు ఈ మ‌ధ్య హిట్ లేద‌న్న సంగ‌తి తెలిసిందే. హిట్ కోసం చాలా ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

Next Story