Ashwin Babu: టీజర్ అప్‌డేట్ ఇచ్చిన చిత్ర బృందం.. రక్తపు మరకలతో దర్శనమిచ్చిన హీరో

by Chukka Sudharani |

‘జీనియస్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో అశ్విన్ బాబు (Ashwin Babu).

Ashwin Babu: టీజర్ అప్‌డేట్ ఇచ్చిన చిత్ర బృందం.. రక్తపు మరకలతో దర్శనమిచ్చిన హీరో
X

దిశ, సినిమా: ‘జీనియస్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో అశ్విన్ బాబు (Ashwin Babu). తర్వాత ‘రాజు గారి గది’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. అనంతరం ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, రాజు గారి గది 2, రాజు గాది గది 3, హిడింభ, శివం భజే’ వంటి మూవీస్‌లో నటించి మెప్పించాడు. ఇప్పుడు ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వచ్చిన వాడు గౌతమ్’ (Vachin Vadu Gautham). మామిడాల ఎం.ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని టీ.గణపతి రెడ్డి నిర్మించారు. ఇందులో రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అభినయ, అజయ్, వీటీవీ గణేష్, షకలక శంకర్, రాఘవ తదితరులు నటిస్తున్నారు.

మెడికో అండ్ యాక్షన్ (Medico and Action) థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ (Teaser) మే 15న రాబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో అశ్విన్ బాబు బ్యాక్ సైడ్‌కు తిరిగి ఉండగా.. వైట్ షర్ట్‌పై రక్తపు మరకలతో సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ సినిమా అయినా నీకు మంచి హిట్ ఇవ్వాలి బ్రదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story