‘మాస్ జాతర’ నుంచి టీజర్ రిలీజ్.. పక్కా మాస్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-08-15 17:13:31  IST  )

మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర.

‘మాస్ జాతర’ నుంచి టీజర్ రిలీజ్.. పక్కా మాస్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. భాను భోగ వరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీ ఆగస్టు 27న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ వరుస అప్‌డేట్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు.

అందులో టీజర్ స్టార్టింగ్‌లోనే రవితేజ వైల్డ్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చి సినిమాపై హైప్ పెంచేశాడు. అయితే మాస్ మహారాజ ఈ మూవీలో రైల్వే పోలీస్‌గా కనిపించనున్నాడు. అలాగే శ్రీలీలతో రొమాన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ, విజువల్స్ అన్ని సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు పక్కా మాస్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story