నాని హిట్-3 కి టీజర్ డేట్ లాక్.. నెట్టింట హైప్ పెంచుతున్న ట్వీట్

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-02-20 13:36:30  IST  )

నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అలా మొదలైంది’(Ala Modalaindi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి..

నాని హిట్-3 కి టీజర్ డేట్ లాక్.. నెట్టింట హైప్ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అలా మొదలైంది’(Ala Modalaindi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే తెలుగు ఆడియన్స్‌లో ఫుల్ మార్కులు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తన నేచురల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను మెప్పించాడు. రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’(saripoda Sanivaaram) సినిమాతో మన ముందుకు వచ్చి ఓకే ఓకే అనిపించుకున్నాడు.

ప్రస్తుతం హీరోగానే కాకుండా నిర్మాతగా మారి పలు చిత్రాలు చేస్తున్నాడు. అలా చేస్తున్న సినిమాల్లో ‘హిట్-3’(HIT-3) ఒకటి. ఈ మూవీలో నాని హీరోగా అండ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని(Prashanthi Tipirneni) నిర్మిస్తున్నారు. ఇందులో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి(srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి టాలెంటెడ్ టెక్నికల్ టీం వర్క్ చేస్తుండగా.. మిక్కీ జె. మేయర్(Mickey J Meyer) సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా మే 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కోసం నాని డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. హిట్-3 నుంచి టీజర్ ఫిబ్రవరి 24న రాబోతున్నట్లు యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేసేశారు. అంతేకాకుండా నానిను బ్యాక్ సైడ్ నుంచి తీసిన ఓ చిన్న వీడియో షేర్ చేస్తూ వైల్డ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించి మరింత క్యూరియాసిటీని పెంచేశారు. దీంతో ఈ మూవీ టీజర్ కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

Next Story