'8 వసంతాలు' నుంచి టీజర్-2 రాబోతుంది.. ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

by I. Sairam |   (  Updated:2025-06-06 12:24:22  IST  )

‘మ్యాడ్’(Mad) ఫేమ్ అనంతిక సునీల్ కుమార్(Ananthika Sunil Kumar) ప్రజెంట్ ‘8 వసంతాలు’(8 Vasanthalu) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

8 వసంతాలు నుంచి టీజర్-2 రాబోతుంది.. ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మ్యాడ్’(Mad) ఫేమ్ అనంతిక సునీల్ కుమార్(Ananthika Sunil Kumar) ప్రజెంట్ ‘8 వసంతాలు’(8 Vasanthalu) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిశోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఫణీంద్ర(Phaneendra) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక దీనిని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక బ్యూటిఫుల్ బ్రేకప్ స్టోరీతో రాబోతున్న ఈ మూవీలో అనంతిక శుద్ధి అయోధ్య పాత్రలో కనిపించనుంది.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ ఈ నెల 20న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్.. తాజాగా ఈ చిత్రం నుంచి ‘టీజర్-2’(Teaser-2)ను విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘రేపు ప్రేమ అనే సున్నితమైన గాలి మిమ్మల్ని తాకుతుంది.. 8 వసంతాలు టీజర్-2 రేపు మధ్యాహ్నం 3.33 గంటలకు విడుదల కానుంది.. ఇక ఈ సినిమా జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది’ అని రాసుకొస్తూ అనంతిక ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story