- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నీళ్లతో ఈ మెసేజ్ టైప్ చేస్తున్నా.. నిన్ను చాలా మిస్ అవుతానంటూ స్టార్ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
శృతి హాసన్(Shruti Haasan) స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: శృతి హాసన్(Shruti Haasan) స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. హిందీ, తమిళ బాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో మహేష్ బాబు(Mahesh Babu), అల్లు అర్జున్, రామ్ చరణ్(Ram Charan), ప్రభాస్, పవన్ కళ్యాణ్,, చిరంజీవి, బాలకృష్ణ(Balakrishna) వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు రజినీకాంత్(Rajinikanth) ‘కూలీ’ మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే విజయ్ చివరి సినిమా జన నాయగన్‌లోనూ నటించనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా, శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది తన ఫ్రెండ్ చనిపోవడంతో ఆమె ఫొటో షేర్ చేస్తూ కన్నీరుమున్నీరైంది. ‘‘ప్రియమైన మెలానీ, నేను మిమ్మల్ని మిస్ అవుతాను. కన్నీళ్లతో ఈ మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడు అన్ని అద్భుతమైన జ్ఞాపకాల గుర్తొచ్చి నా ముఖంలో చిరునవ్వు కూడా ఉంది. మీరు నిజమైన పంక్ రాకర్. మీరు నాకు సోదరి కంటే ఎక్కువ. స్త్రీల శక్తిని నమ్ముతారు. ది ఐ కోసం మమ్మల్ని అందరినీ ఒకచోట చేర్చారు. మీతో కలిసి పనిచేయడం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. నా సామర్థ్యాలపై మీకు ఉన్న ప్రేమ, ప్రోత్సాహం, విశ్వాసం నేను గ్రహించగలిగిన దానికంటే మించినది. నేను ఆ శక్తిని, నీ మాటలను జీవితంలో ముందుకు తీసుకువెళతాను. లవ్ యు మెల్, నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. స్వర్గంలో రాక్ ఎన్ రోల్.. ఎప్పటిలాగే జోరుగా ఉండండి’’ అని రాసుకొచ్చింది.






