ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బిగ్ అప్డేట్.. ఆ హీరోయిన్ పోస్టర్ రిలీజ్

by velandi.Saikiran |

జనసేన అధినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) రాజకీయాలతో పాటు వరుసగా సినిమాలు చేసుకుంటూ

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బిగ్ అప్డేట్.. ఆ హీరోయిన్ పోస్టర్ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్ : జనసేన అధినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) రాజకీయాలతో పాటు వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పెండింగ్ లో పడ్డ ప్రాజెక్టులను... చకచకా ఫినిష్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ లిస్టులో ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustaad Bhagat Singh) కూడా ఉంది. ఈ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరావేగంగా జరుపుకుంటున్న ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్ గా కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలోనే ఈ సినిమా వస్తోంది.

అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో రాశి ఖన్నా కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే రాశి ఖన్నా పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇందులో శ్లోక అనే పాత్రలో హీరోయిన్ రాశి ఖన్నా ( Raashii Khanna) కనిపించబోతున్నారట. ఆమె ఫోటోగ్రఫీ జర్నలిస్టు అని తెలుస్తోంది. పోస్టర్లు కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా పేర్కొంది చిత్ర బృందం. ఇక ఈ పోస్టర్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఫ్యాన్స్ హడావిడి మొదలైంది.

Twitter Link

Next Story