'మన శంకర వరప్రసాద్ గారు' టికెట్ ధ‌ర‌లు ఫిక్స్‌..ఎంతంటే !

by velandi.Saikiran |

జనవరి 11వ తేదీన మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రీమియర్లు వేయాలని నిర్ణయం తీసుకుందట. ఈ ప్రీమియర్ల నేపథ్యంలో ఒక్క టికెట్ ధర 500 రూపాయలు ఛార్జ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయానికి వచ్చినట్లు టాక్ న‌డుస్తోంది.

మన శంకర వరప్రసాద్ గారు టికెట్ ధ‌ర‌లు ఫిక్స్‌..ఎంతంటే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. కామెడీ, ఫ్యామిలీ జోనర్ లో వస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపిస్తున్నారు. ఈ మూవీలో దాదాపు 20 నిమిషాల పాటు వెంకటేష్ రోల్ ఉంటుందట. చిరంజీవి, వెంకటేష్ మధ్య ఓ సాంగ్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. ఇలాంటి నేపథ్యంలో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 11వ తేదీన ఈ మూవీ ప్రీమియర్లు వేయాలని నిర్ణయం తీసుకుందట. ఈ ప్రీమియర్ల నేపథ్యంలో ఒక్క టికెట్ ధర 500 రూపాయలు ఛార్జ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయానికి వచ్చినట్లు టాక్ న‌డుస్తోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రీమియర్లు వేయాలని అనుకుంటున్నారట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

Next Story