- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈషా అంటే నాకు చాలా ఇష్టం..స్టేజ్ పైనే ఓపెన్ అయిన తరుణ్ భాస్కర్ !
తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈషా రెబ్బ అంటే తనకు చాలా ఇష్టమంటూ స్టేజ్ పైనే ఓపెన్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరో అవతారంలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఓం శాంతి శాంతి శాంతిః ( OmShantiShantiShanti) అనే సినిమాతో తరుణ్ భాస్కర్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ మూవీలో ఈషా రెబ్బ ( Eesha Rebba) హీరోయిన్ గా చేస్తున్నారు. రెండు సంవత్సరాల కిందట జయ జయ జయ జయహే అనే సినిమా మలయాళం లో వచ్చి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు రీమేక్ గా ఇప్పుడు ఓం శాంతి శాంతి శాంతిః సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 30వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈషా రెబ్బ అంటే నాకెంతో ఇష్టం
మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈషా రెబ్బ అంటే తనకు చాలా ఇష్టమంటూ స్టేజ్ పైనే ఓపెన్ అయ్యారు. ఈషా అంటే శాంతి అని.. ఆమె ఎంతో గొప్ప యాక్టర్ అని వెల్లడించారు. కానీ శాంతిగా ఓర్పుగా అన్ని పాత్రలు చేయగల సత్తా ఉందని కితాబు ఇచ్చారు. ఇండస్ట్రీలో ఈషా రెబ్బలు మించిన వాళ్లు లేరని కొనియాడారు. దీంతో తరుణ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ మధ్య రిలేషన్ ఉందని ఇప్పటికీ వార్తలు వస్తాయన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలోనే స్టేజ్ పైన ఈషాను తరుణ్ భాస్కర్ మెచ్చుకోవడం గమనార్హం.






