- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నానితో సినిమా గురించి ఓపెన్ అయిన తరుణ్ భాస్కర్
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ… నాని ఒక అద్భుతమైన నటుడు అని, ఆయనతో సినిమా చేయాలని ఎంతో ఆశగా ఉందని తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో నాని ఒకరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ అద్భుతమైన స్థాయికి చేరుకున్నారు. ఇప్పటివరకు ఈ నటుడు స్టార్ దర్శకులతో చాలా తక్కువ సినిమాలు చేయగా, మీడియం రేంజ్ మరియు చిన్న దర్శకులతో ఎక్కువ సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరైన తరుణ్ భాస్కర్, నానితో సినిమా చేసే విషయంపై తాజాగా ఓపెన్ అయ్యారు. ఇటీవల ఆయన “గాయపడ్డ సింహం” సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాను మే 1వ తేదీన విడుదల చేయనున్న నేపథ్యంలో ఆయన వరుసగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
ఈ ప్రచారాలలో భాగంగా తరుణ్ భాస్కర్, నానితో సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ… నాని ఒక అద్భుతమైన నటుడు. ఆయనతో సినిమా చేయాలని ఎంతో ఆశగా ఉందని తెలిపారు. ఒకవేళ నానితో సినిమా సెట్ అయితే అది అద్భుతంగా ఉంటుందని, మరికొంత కాలంలోనే ఒక మంచి కథను డెవలప్ చేసి ఆయనకు వినిపించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తాజాగా తరుణ్ భాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






