- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా మొదలైన 5 నిమిషాలకే అది మర్చిపోతారు.. ENE2 గురించి ఓపెన్ అయినా తరుణ్ భాస్కర్.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ… 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో కార్తీక్ పాత్రలో నటించిన సుశాంత్ స్థానంలో శ్రీనాథ్ మాగంటిని తీసుకున్నామని తెలిపారు. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాలకే ప్రేక్షకులు మొదటి భాగాన్ని మర్చిపోయి, రెండో భాగంతో సులభంగా కనెక్ట్ అవుతారని ఆయన చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'పెళ్లి చూపులు' మూవీతో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమతం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ 'ఈ నగరానికి ఏమైంది 2' (ENE2) చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 'ఈ నగరానికి ఏమైంది' చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో కార్తీక్ పాత్రలో నటించిన సుశాంత్ స్థానంలో శ్రీనాథ్ మాగంటిని తీసుకున్నారు.
గతంలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, సుశాంత్‌కు కొన్ని కమిట్‌మెంట్లు ఉండటంతో ఈ సినిమాలో నటించలేకపోయాడని, అందుకే ఆ పాత్రకు వేరే నటుడిని తీసుకున్నామని చెప్పారు. తాజాగా తరుణ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయనను, 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన నలుగురికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అలాంటి సమయంలో అందులో ఒకరిని తీసేసి వేరే వ్యక్తిని పెట్టడం వల్ల సినిమాపై ఏమైనా ప్రభావం పడుతుందా? అనే ప్రశ్న అడిగారు. దానికి తరుణ్ భాస్కర్ స్పందిస్తూ, ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ పూర్తయ్యిందని, మొత్తం చూసుకున్నానని, అద్భుతంగా వచ్చిందని తెలిపారు.
xమరికొన్ని రోజుల్లో సెకండ్ హాఫ్ షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాలకే ప్రేక్షకులు మొదటి భాగం నుండి విడిపోయి, రెండో భాగంతో కొత్తగా కనెక్ట్ అవుతారని ఆయన అన్నారు. ఇక సుశాంత్ కొన్ని కారణాల వల్ల తప్పుకోవడంతో శ్రీనాథ్‌ను తీసుకున్నామని తెలిపారు. ఆ పాత్ర కోసం ఎంతోమందిని ఆడిషన్ చేయగా, అందులో శ్రీనాథ్ మాగంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడని చెప్పారు. ఆయన సుశాంత్ స్థానాన్ని అద్భుతంగా భర్తీ చేయగలడని, ప్రేక్షకులకు ఆ విషయంలో ఎలాంటి సందేహం ఉండదని భరోసా ఇచ్చారు. ఇక 'ఈ నగరానికి ఏమైంది 2' చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.






