‘హరిహర వీరమల్లు’ నుంచి తార తార నా కళ్లు సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్..

by I. Sairam |   (  Updated:2025-07-27 11:21:34  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ(Jyothi Krishna) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu).

‘హరిహర వీరమల్లు’ నుంచి తార తార నా కళ్లు సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ(Jyothi Krishna) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) విలన్‌గా కనిపించనున్నాడు. అయితే దీనిని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(AM Rathnam) నిర్మిస్తున్నారు.

ఇక రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డు విజేత ఎం ఎం కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్నారు. కాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూన్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి నాలుగో పాట తార తార నా కళ్లు సాంగ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. నిధి త‌న అందాల‌తో ఆక‌ట్టుకుంది. శ్రీ హ‌ర్ష లిరిక్స్ అందించ‌గా లిప్సిక‌, ఆదిత్య పాడారు. ఎంఎం కీర‌ణ‌వాణి సంగీతాన్ని అందించారు.ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Video Link

Next Story