కోట శ్రీనివాస్ మృతిపై తనికెళ్ల భరణి సంతాపం.. కోట లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరంటూ ఎమోషనల్

by I. Sairam |

తెలుగు చిత్ర పరిశ్రమ (Telugu film industry)లో తీవ్ర విషాదం నెలకొంది.

కోట శ్రీనివాస్ మృతిపై తనికెళ్ల భరణి సంతాపం.. కోట లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరంటూ ఎమోషనల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమ (Telugu film industry)లో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు (Senior Tollywood actor) కోట శ్రీనివాస రావు(83) అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా శ్లోక సంద్రంలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన భౌతికకాయానికి తనికెళ్ల భరణి నివాళుర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘మా ఇద్దరిది 50 ఏండ్ల సహచర్యం.

కోట శ్రీనివాసరావు తాను అనుకున్నది సాధించారు. ఆయన కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. కోట లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు. ఆయనతో కలిసి అనేక నాటకాలు చేశాను. ఆయన తపన, నిబద్ధతతో పని చేశారు. కోట శ్రీనివాసరావు సినీ ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగింది. యావత్‌ భారతదేశం ఆయనను గుర్తించింది. పరమేశ్వరుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఎమోషనల్ అయ్యారు.

Next Story