‘తన్వి ది గ్రేట్’ సినిమాలో తమిళ స్టార్.. ఈ పాత్ర సంవత్సరాల తరబడి గుర్తుండిపోతుందంటూ మేకర్స్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-09 14:05:53  IST  )

బాలీవుడ్ స్టార్ అనుపమ్ ఖేర్(Anupam Kher) దర్శకత్వంలో రాబోతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘తన్వి ది గ్రేట్’(Thanvi the Great).

‘తన్వి ది గ్రేట్’ సినిమాలో తమిళ స్టార్.. ఈ పాత్ర సంవత్సరాల తరబడి గుర్తుండిపోతుందంటూ మేకర్స్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ అనుపమ్ ఖేర్(Anupam Kher) దర్శకత్వంలో రాబోతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘తన్వి ది గ్రేట్’(Thanvi the Great). ఇందులో శుభంగి(Shubhangi) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. దీనిని అనుపమ్ ఖేర్ స్టూడియోస్, ఎన్‌ఎఫ్‌డిసి బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ విడుదల కాకముందే ఓ అరుదైన గౌరవాన్ని కూడా దక్కించుకుంది. ఈ చిత్రాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించబోతున్నారట. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ క్యూరియాసిటీని పెంచుతున్నారు.

తాజాగా, చిత్రబృందం ఈ సినిమాలో తమిళ స్టార్ నటుడు అరవింద్ స్వామి(Arvind Swami) నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఆయన మాజ్ శ్రీనివాస్ పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ‘‘అరవింద్ ధైర్యంతో ఓ శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మన భారత సైన్యం, స్ఫూర్తిని ప్రతిధ్వనించే క్యారెక్టర్. సురక్షితమైనది, బలమైనది , గౌరవప్రదమైనది. స్వామీ జీ, మీ ప్రతిభ సంవత్సరాల తరబడి గుర్తుండిపోతుంది’’ అని రాసుకొచ్చారు. కాగా అరవింద్ స్వామి గత ఏడాది కార్తి హీరోగా నటించిన ‘సత్యం సుందరం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Next Story