DNA: తెలుగులో కూడా ఫుల్ జోష్ మీద ఉన్న తమిళ బ్లాక్ బస్టర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

by Chukka Sudharani |

తమిళంలో ఘన విజయం సాధించిన ‘డీఎన్‌ఏ’ సినిమా తెలుగులో ‘మై బేబి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

DNA: తెలుగులో కూడా ఫుల్ జోష్ మీద ఉన్న తమిళ బ్లాక్ బస్టర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: తమిళంలో ఘన విజయం సాధించిన ‘డీఎన్‌ఏ’ సినిమా తెలుగులో ‘మై బేబి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. నెల్సన్ వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామాలో నిమిషా సజయన్, అథర్వ మురళీ కీలక పాత్రల్లో నటించారు. ఇక మూవీ ఎస్‌కె పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జులై 18న రిలీజ్‌కు సిద్ధం అవుతోన్న ‘మై బేబి’ మూవీ రీసెంట్‌గా సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా పంపిణీ హక్కులు హాట్‌కేక్‌ల్లా అమ్ముడవడంతో 350 కు పైగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. నైజాంలో గ్లోబల్ సినిమాస్-ఏషియన్ సునీల్, వైజాగ్‌లో గాయత్రిదేవి ఫిలిమ్స్- సతీష్, ఈస్ట్ గోదావరిలో ఆదిత్య సినిమాస్-హెచ్. నాగి సత్యనారాయణ, వెస్ట్ గోదావరిలో వెంకటేశ్వర ఫిలిమ్స్-కృష్ణారెడ్డి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్-శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లాలో వెంకటేశ్వర ఫిలిమ్స్-కృష్ణారెడ్డి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గురు రాఘవేంద్ర ఫిలిమ్స్-శోభన్, చిత్తూరు, కడప జిల్లాల్లో ధనలక్ష్మి ఫిలిమ్స్-డి. సుభాష్ చంద్ర నాయుడు హక్కులను సొంతం చేసుకున్నారు. తమిళంలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ చిత్రం, తెలుగులో కూడా అదే స్థాయిలో ఆకట్టుకునే అవకాశం ఉందని నిర్మాత సురేష్ కొండేటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రధానంగా యువతను ఆకర్షించే కథాంశంతో, సమాజంలోని సున్నితమైన అంశాలను చర్చించేలా రూపొందింది.

Next Story