హీరో శివ కార్తికేయన్ కారుకు ప్రమాదం

by Gantepaka Srikanth |

హీరో శివ కార్తికేయన్ కారుకు ప్రమాదం

హీరో శివ కార్తికేయన్ కారుకు ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ హీరో శివ కార్తికేయన్(Hero Sivakarthikeyan) కారు ప్రమాదానికి గురైంది. శివ కార్తికేయన్ కారును వెనుక నుంచి మరో కారు(Car Accident) ఢీకొట్టింది. ప్రమాదంలో శివ కార్తికేయన్ ముప్పు తప్పింది. కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది. చెన్నై(Chennai)లోని కైలాశ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, రెమో సినిమాతో తెలుగువారికి దగ్గరైన శివకార్తికేయన్ డాక్టర్, డాన్, ప్రిన్స్, అమరన్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పరాశక్తి సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Next Story