Aishwarya Rajesh: తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులోకి తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

by Chukka Sudharani |

అరివాజగన్ వెంకటాచలం (Arivajagan Venkatachalam) దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ఆరతు సీనం’.

Aishwarya Rajesh: తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులోకి తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
X

దిశ, సినిమా: అరివాజగన్ వెంకటాచలం (Arivajagan Venkatachalam) దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ఆరతు సీనం’. డిమోంటి కాలనీ హీరో అరుళ్ నీతి తమిళరాజు, ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), ఐశ్వర్య దత్త కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం 2016లో తమిళంలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను నిర్మాత బాలు చరణ్ ‘గరుడ 2.0’గా తెలుగు ప్రక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘గరుడ 2.0’ (Garuda 2.0) రిలీజ్ చేయడంపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఇప్పుడు డైరెక్ట్‌గా ఆహా(aha)లోకి తీసుకొచ్చారు.

తమిళంలో గొప్ప విజయం సాధించిన చిత్రం మన తెలుగు ప్రేక్షకులకు మేపిస్తుంది అని నిర్మాత బాలు చరణ్ అన్నారు. కాగా.. హీరో అరుళ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతడు తన భార్య కూతురితో ఎంతో సంతోషంగా జీవించేవాడు. కానీ కొందరు క్రిమినల్స్ హీరో భార్య కూతురిని చంపేస్తారు. దీంతో మందుకు భానీసైనా అరుళ్ మళ్లీ కొన్నాళ్లకు హైయర్ ఆఫీసర్స్ కోరిక మేరకు డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఈ క్రమంలోనే అతడికి వరుసగా హత్యలు చేస్తున్న ఓ సీరియల్ కిల్లర్ కేసు అప్పగిస్తాడు. అయితే.. అసలు హత్యలు చేసేది ఎవరూ? అతడిని హీరో పట్టుకుంటాడు? అనేది స్టోరీ.

Next Story