సెల్ఫీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఉప్పొంగిపోయిన తమిళ నటుడు

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-07 12:11:41  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ప్రధాన పాత్రలో వస్తోన్న ఓజీ సినిమా(OG Movie) షూటింగ్ మెరుపు వేగంతో కొనసాగుతోంది.

సెల్ఫీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఉప్పొంగిపోయిన తమిళ నటుడు
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ప్రధాన పాత్రలో వస్తోన్న ఓజీ సినిమా(OG Movie) షూటింగ్ మెరుపు వేగంతో కొనసాగుతోంది. ఇటీవలే ముంబై షెడ్యూల్ పూర్తి కాగా.. తాజాగా విజయవాడ షెడ్యూలు మొదలైంది. తాడేపల్లిలో 10 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూలులో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌తో మొత్తం షూట్ పూర్తి అవుతుందని టాక్ న‌డుస్తుంది. ప‌ది రోజుల‌లో షూటింగ్ మొత్తం పూర్తి కానుంద‌ని తెలిసి ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. షూటింగ్‌కు వచ్చిన పవన్ కల్యాణ్‌తో తమిళ నటుడు అర్జున్ దాస్(Arjun Das) సెల్ఫీ దిగారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. మీతో కలిసి పనిచేసిన ప్రతీ రోజును నేను ఎంతో ఆస్వాదిస్తున్నాను. మీ షెడ్యూల్ ఎంత బిజీనో మాకు తెలిసు. అయినా కూడా ఏమాత్రం రెస్ట్ లేకుండా షూటింగ్‌కు వస్తున్న మీ డెడికేషన్‌ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. మీతో పనిచేసే అవకాశం దొరకడం మా అదృష్టం. షూటింగ్ సమయంలో మీరు చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుంచుకుంటా. మళ్లీ మళ్లీ మీతో పనిచేయాలని ఉంది. థాంక్యూ సో మచ్ సార్’ అని అర్జున్ దాస్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

కాగా, డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్(Sujith) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతుంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ ఆలస్యమైనపప్పటీకీ.. ఈ సినిమాపై పెరుగుతున్న క్రేజ్ రోజురోజుకి పెరుగుతూ పోతుంది.

Next Story