Tamanna: కొత్త బంధాలను వెతుక్కోవడంలో తప్పులేదు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

పర్సనల్ లైఫ్, ప్రేమ వ్యవహారాలపై హీరోయిన్ తమన్నా చేసిన కామెంట్స్ ప్రజెంట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Tamanna: కొత్త బంధాలను వెతుక్కోవడంలో తప్పులేదు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా తన పర్సనల్ లైఫ్, ప్రేమ వ్యవహారాలపై చేసిన కామెంట్స్ ప్రజెంట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా ఒకసారి ప్రేమలో విఫలం అయినా అటు వైపుమళ్లీ వెళ్లాలి అనుకోవడం లేదు అని అంటుంటారు. కానీ తమన్నా ఆలోచనలు దానికి భిన్నంగా ఉన్నాయి. విజయ్ వర్మతో ప్రేమ, బ్రేకప్ అనంతరం మళ్లీ కెరీర్‌పై ఫోసక్ పెట్టి వరుస సినిమాలు చేస్తుంది. ఇందులో భాగంగానే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. ప్రేమ ఒక్కరితోనే ఆగిపోవాల్సిన అవసరం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘జీవితంలో ఎన్నిసార్లు అయినా ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. అది కేవలం ఒక్క వ్యక్తికే పరిమితం కావాల్సిన అవసరం లేదు. మనసుకు నచ్చిన వ్యక్తి దొరికే వరకు కొత్త బంధాలను వెతుక్కోవడంలో తప్పు లేదు. ఎందుకంటే బంధాలు అనేవి మనల్ని ఒకచోట కట్టిపడేసేవిగా లేదా మన స్వేచ్ఛను హరించేవిగా ఉండకూడదు. భాగస్వామితో ఉండే బంధం మన ఎదుగుదలకు తోడ్పడేలా, ఒకరినొకరు ప్రోత్సహించుకునేలా ఉండాలి. అలాంటి ఆరోగ్యకరమైన బంధం దొరికే అన్వేషణ కొనసాగిస్తూనే ఉంటా’ అంటూ తమన్నా చెప్పడం విశేషం.

Next Story