మళ్లీ ప్రేమలో పడిన తమన్నా మాజీ ప్రియుడు.. ఇన్‌స్టాలో ఫొటో పోస్ట్

by Gantepaka Srikanth |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా మాజీ ప్రియుడు విజయ్ వర్మ మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. వాలంటైన్స్ డే రోజున.. తమన్నాతో బ్రేకప్ అయినట్లు అధికారికంగా కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది.

మళ్లీ ప్రేమలో పడిన తమన్నా మాజీ ప్రియుడు.. ఇన్‌స్టాలో ఫొటో పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) మాజీ ప్రియుడు విజయ్ వర్మ(Vijay Varma) మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. వాలంటైన్స్ డే(Valentine's Day) రోజున.. తమన్నాతో బ్రేకప్ అయినట్లు అధికారికంగా కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. అదెలా అని ఆశ్చర్యపోకండి.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మరో యువతితో దిగిన ఫొటోను విజయ్ వర్మ స్టోరీ(స్టేటస్) పెట్టారు. దీనికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ఫరెవర్’ అని క్యాప్షన్ జోడించారు. దీంతో తమన్నాతో బ్రేకప్ అయ్యాక.. విజయ్ వర్మ మరోసారి ప్రేమలో పడినట్లు కన్ఫామ్ అయిపోయిందని నెట్టింట చర్చ జరుగుతోంది. అంతేకాదు.. విజయ్ వర్మ పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే ఆ ఫోటో స్క్రీన్‌షాట్లు వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ, కొత్త ప్రేమ కథ మొదలైందా అని ప్రశ్నించారు. కొందరు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు విజయ్ వర్మ పోస్టు చేసిన అకౌంట్ నిజమైన వ్యక్తికి సంబంధించినది కాదని కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో మొదట నిజమని నమ్మిన చాలామంది.. ఈ విషయం తెలిసి లైట్ తీసుకున్నారు.




Next Story