Tamannaah: రీ ఎంట్రీ కోసం రవితేజను నమ్ముకున్న తమన్నా

by Pulgam srinivas |   (  Updated:2026-03-12 11:08:56  IST  )

రవితేజ హీరోగా, ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇరుముడి' చిత్రంలో తమన్నా నటించే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది.

Tamannaah: రీ ఎంట్రీ కోసం రవితేజను నమ్ముకున్న తమన్నా
X

దిశ, వెబ్ డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నా, మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన 'శ్రీ' అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత తమన్నా 'హ్యాపీ డేస్' అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో ఓవర్ నైట్ లో ఈ నటికి స్టార్ హీరోయిన్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు ఈ హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని రేంజ్లో దూసుకుపోయింది.

ప్రస్తుతం ఈ సీనియర్ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. ఇక స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాల విషయానికి వస్తే, ఈమె చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా మిల్కీ బ్యూటీకి నిరాశనే మిగిల్చింది. మళ్లీ తమన్నా తెలుగులో ఓ స్టార్ హీరో సినిమాలో నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఇరుముడి అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ప్రియ భవాని శంకర్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర ఉన్నట్లు, అందులో తమన్నాను తీసుకోవాలనే ఆలోచనలో భాగంగా ఈ మూవీ బృందం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. చాలా సంవత్సరాల క్రితం రవితేజ హీరోగా రూపొందిన 'బెంగాల్ టైగర్'లో తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ మూవీలోని వీరిద్దరి జంటకు మంచి ప్రశంసలు దక్కాయి.

Next Story