- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tamannaah Bhatia: రిలీజ్‌కు సిద్ధమైన తమన్న మూవీ.. భయంకరంగా ఆకట్టుకుంటోన్న పోస్టర్
మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది.

దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఇక రీసెంట్‌గా ‘ఓదెల-2’ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. హిందీలో మాత్రం రెండు, మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వాటిలో ‘వ్వన్- ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ (VVAN - Force of the Forest) ఒకటి. జానపద థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అరుణాభ్ కుమార్ (Arunabh Kumar), దీపక్ కుమార్ మిశ్రా (Deepak Kumar Mishra) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) హీరోగా నటిస్తుండగా.. తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుంది.
అటవీ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీని బాలాజీమోషన్ పిక్చర్స్ అండ్ టీవీఎఫ్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా రిలీజ్ అప్‌డేట్ ఇచ్చింది తమన్న. ‘అడవి గుసగుసలాడుతుంది.. 2026 మే 15న ఆ శక్తి విడుదల అవుతుంది! ఈ అడ్వంచర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు సిద్ధంగా ఉండండి!’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో ఒక పూరాతన ఆలయం కనిపిస్తుండగా.. చుట్టూ ఉన్న అడవి రెండు కళ్లుగా మారి భయంకరంగా చూస్తుంది. ఆ రెండు కళ్ల మధ్య నుంచి ఓ వ్యక్తి లాంతర్‌తో వెళ్తుండటం చూడొచ్చు. మొత్తంగా ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచడంతో పాటు భయంకరంగా ఆకట్టుకుంటోంది.






