- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోల్డ్ సీన్లు చేయాలంటూ దర్శకుడు టార్చర్..ఇచ్చిపడేసిన తమన్నా ?
బోల్డ్ పాత్ర చేయడం తనకు నచ్చలేదని.. డైరెక్టర్ ముఖం మీదే నో చెప్పినట్లు తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారట.

దిశ, వెబ్ డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అయినా.. అగ్రశ్రేణి హీరోయిన్ గా ఆమె కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశం వచ్చిన అందిపుచ్చుకొని, దూసుకు వెళ్తున్నారు తమన్నా భాటియా. హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ ఇరగదీస్తోంది. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ చేస్తూ బోల్డ్ గా కూడా కనిపించింది. అయితే అలాంటి హీరోయిన్ తమన్నా భాటియా గురించి ఓ షాకింగ్ నిజం బయటపడినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ఓ సినిమా షూటింగ్ సమయంలో బోల్డ్ పాత్ర చేయడం తనకు నచ్చలేదని.. డైరెక్టర్ ముఖం మీదే నో చెప్పినట్లు తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారట. అయితే అప్పుడు ఆయన అందరి ముందే, హీరోయిన్ ను మార్చండి అంటూ కాస్త ఓవర్ గా రియాక్ట్ అయ్యాడట. అంతేకాదు తనను ప్రెషర్ లోకి నెట్టినట్లు తమన్నా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కానీ నేను తగ్గకుండా.. ఏది జరిగినా ఎదుర్కొంటానని ధైర్యంగా ముందుకు వెళ్లినట్లు స్పష్టం చేసిందట. అయితే కొన్ని రోజుల తర్వాత అదే దర్శకుడు తనకు క్షమాపణలు కూడా చెప్పినట్లు తమన్నా భాటియా వెల్లడించిందట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్... తమన్నా ధైర్యానికి ఫిదా అయిపోతున్నారు. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. నచ్చితే చేయాలి.. లేదా ముఖం మీదే చెప్పేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






