తమన్నాను టార్చర్ చేస్తున్న ఆ న్యూస్ పేపర్?

by velandi.Saikiran |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాను ( Tamannaah Bhatia ) ఓ న్యూస్ పేపర్ చాలా ఇబ్బంది పెట్టిందట. ఆ న్యూస్ పేపర్ లో

తమన్నాను టార్చర్ చేస్తున్న ఆ న్యూస్ పేపర్?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాను ( Tamannaah Bhatia ) ఓ న్యూస్ పేపర్ చాలా ఇబ్బంది పెట్టిందట. ఆ న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రత్యేక కథనం కారణంగా... హీరోయిన్ తమన్నా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి చోటు చేసుకుందట. ఈ విషయాలను తాజాగా స్వయంగా హీరోయిన్ తమన్నా పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ తమన్నా అడుగు పెట్టి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలోనే తన గత అనుభవాలను పంచుకున్నారు హీరోయిన్ తమన్నా. సినిమా ఇండస్ట్రీలో... గడిచిన 20 సంవత్సరాలుగా కొనసాగుతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.


స్కూల్ ( School ) సమయం లోనే తాను సినిమాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు హీరోయిన్ తమన్నా. స్కూల్ సమయంలో... సినిమాల్లోకి వచ్చిన తనకు ఫీచర్లు ఎంతగానో సహకారం చేశారని ఆమె గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. అలాగే తన జీవితంలో జరిగిన ఒక సన్నివేశం గురించి చెప్పుకొని బాధపడ్డారు తమన్నా. తన 21వ పుట్టినరోజున ఓ ప్రముఖ న్యూస్ పేపర్ లో తనపై ప్రత్యేక కథనం వచ్చిందని వెల్లడించారు. అయితే ఆ కథనం కారణంగా తాను కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత... తన లైఫ్ సాఫీగా కొనసాగుతోందని వెల్లడించారు.


జీవితం అన్నాక ఎన్నో ఒడిదొడుకులు వస్తాయని... వాటన్నిటిని నిలదొక్కుకుంటేనే.. సక్సెస్ ( Success) అవుతామని కూడా పేర్కొన్నారు హీరోయిన్ తమన్నా ( Tamannaah Bhatia ). తాను సినిమాలను ఎప్పుడూ.. ఓ వృత్తిగా... చూడలేదని... నా జీవితం అనుకోని చేశానని తమన్నా చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా... హీరోయిన్ తమన్నా తెలుగులో తాజాగా నటించిన సినిమా ఓదెల 2 ( Odela 2). ఈ సినిమా ఈనెల 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. కాగా... హీరోయిన్ తమన్నా.. తన ప్రియుడు విజయ్ వర్మతో బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత నెల రోజుల కిందట వీళ్ళిద్దరూ విడిపోయినట్లు.. న్యూస్ వైరల్ అవుతోంది.

Next Story